‘కుల నిర్మూలనతోనే సమసమాజ నిర్మాణం’
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:20 AM
కుల నిర్మూలనతోనే సమ సమాజ నిర్మాణం సాధ్య మని సంఘం రాష్ట్ర నాయకుడు ఎన్.వేణు గోపాల్ అన్నారు.
అరసవల్లి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): కుల నిర్మూలనతోనే సమ సమాజ నిర్మాణం సాధ్య మని సంఘం రాష్ట్ర నాయకుడు ఎన్.వేణు గోపాల్ అన్నారు. ఇలిసి పురం అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో ఆదివారం సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ అధ్యక్షతన రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు గోపాల్ ‘రాజ్యాంగం-దళితులు’ అంశంపై మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ రాజ్యాంగం కులాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించ లేదన్నారు. దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, క్రైస్తవులు, మహిళలు పోరాటాలు చేసి హక్కులు సాధించు కోవాలన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రతిని ధులు రాకోటి రాంబాబు, మిస్కా కృష్ణయ్య, కోట ధర్మారావు, డా.అరవింద్, డా.నారా యణరావు, తాండ్ర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.