భారతీయుల ఆరాధ్యుడు అంబేద్కర్
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:05 AM
ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన డా.బీఆర్ అంబేద్కర్ భారతీయుల ఆరాధ్యుడు అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
సరుబుజ్జిలి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన డా.బీఆర్ అంబేద్కర్ భారతీయుల ఆరాధ్యుడు అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయు డు అన్నారు. పురుషోత్తపురం పంచాయతీ ఫకీర్‌సాహెబ్ పేటలో అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం రచన లో తనదైన ముద్ర వేసుకున్న అంబేద్కర్ ఎన్నో అవమా నాలను భరించి నా అందరి హృదయాల్లో శాశ్వత స్థానం పొం దారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఎమ్మె ల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంటుందని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారతీయులందరికీ పవిత్ర గ్రంథంగా తీర్చిది ద్దారన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన యువతను వారు అభినందించారు. గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మిం చాలని స్థానిక యువత కోరగా తగు చర్యలు తీసుకుం టామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. కార్యక్రమం లో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, రాష్ట్ర డైరెక్టర్లు బోనెల అప్పారావు, తమ్మినేని చంద్రశేఖర్, నాయకులు కిల్లి సిద్దార్థ, పల్లి సురేష్, కిల్లి శేషు, జనసేన కన్వీనర్ పేడాడ రామ్మోహన్, దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు.
పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యం
ఆమదాలవలస, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధిలోని ప్రజలకు అన్ని వేళలా మెరుగైన వైద్య సేవ లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. మున్సిపల్ కార్యాలయ సమీపంలో రూ.5.75 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రి భవనాల నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ తమ్మినేని గీతాసాగర్, టీడీపీ జిల్లా మహిళా అధ్య క్షురాలు తమ్మినేని సుజాత, నాయ కులు తమ్మినేని చంద్ర శేఖర్, నూకరాజు, మాధవి, సునీత, జనసేన కన్వీనర్ పేడాడ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
పశుపోషణతో ఇంటిల్లిపాదీ ఆరోగ్యం
సరుబుజ్జిలి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పోషక పదార్థాలు అందించే పశుపోషణతో ఇంటిల్లిపాదికీ ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శనివారం పురుషో త్తపురంలో లేగ దూడల ప్రదర్శన, పశు వైద్య శిబిరం నిర్వహిం చారు. పశు పెంపకానికి అవసరమైన చర్యలను కూటమి ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. విజేతలకు బహుమతులు అం దించారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి గురుగుబిల్లి శ్రీనివాసరావు, పలువురు టీడీపీ నేతలు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.