అమర్‌నాథ్ హత్య వైసీపీ వైఫల్యానికి దర్పణం
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:10 AM
అమర్ నాథ్ గౌడ్ హత్య వైసీపీ పాలనా వైఫల్యానికి దర్పణం పట్టిందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో రేపల్లెలో ఓ యువతిపై వేధింపులను ప్రశ్నించినందుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన అమర్‌నాథ్ గౌడ్‌పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన రాష్ట్ర ప్రజలను కలచి వేసిందన్నారు.
పాతపట్నం, జూన్ 16(ఆంధ్రజ్యోతి): అమర్ నాథ్ గౌడ్ హత్య వైసీపీ పాలనా వైఫల్యానికి దర్పణం పట్టిందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో రేపల్లెలో ఓ యువతిపై వేధింపులను ప్రశ్నించినందుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన అమర్‌నాథ్ గౌడ్‌పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన రాష్ట్ర ప్రజలను కలచి వేసిందన్నారు. ఇటువంటి ఘటనల కారణంగానే గొడ్డలి పార్టీకి ప్రజలు తిలోదకా లిచ్చారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక అందిస్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇసుక మాఫియా అంటూ అర్ధంలేని వ్యాఖ్యలు చేయడం తన ఉనికిని చాటుకొనే ప్రయత్నమే అని అన్నారు. పేదోడికి పట్టెడన్నం పెట్టే అన్నక్యాంటీన్ నిర్మాణాన్ని అడ్డుకొని వారి దిగజారుడు తనాన్ని చాటుకొన్నారన్నారు. కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బుధవారం విజయోత్సవ సభను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కూటమి నేతలు పైల బాబ్జీ, సైలాడ సతీష్, ఎస్.మధుబాబు, శివాల చిన్నయ్య, కలమట భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.