ట్రిపుల్ ఐటీ ఇన్‌చార్జి డైరెక్టర్‌గా అమరేంద్రకుమార్
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:18 AM
Amarendra Kumar took charge ఆర్జీయూకేటీ, శ్రీకాకుళం క్యాంపస్(ట్రిపుల్ ఐటీ) ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న అమరేంద్రకుమార్‌కు శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎం.మధుమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.
ఎచ్చెర్ల, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ఆర్జీయూకేటీ, శ్రీకాకుళం క్యాంపస్(ట్రిపుల్ ఐటీ) ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ప్రొఫెసర్ సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న అమరేంద్రకుమార్‌కు శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆర్జీయూకేటీ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎం.మధుమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డైరెక్టర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ కేవీజీడీ బాలాజీ తన విధుల నుంచి రిలీవ్ అయ్యారు. గత ప్రభుత్వం హయాంలో డైరెక్టర్‌గా నియమితులైన బాలాజీ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజీనామా చేశారు. కానీ ఇప్పటివరకు ఆయనే డైరెక్టర్‌గా కొనసాగారు. ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఈ క్యాంపస్ సక్రమంగా నిర్వహించేలా, మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తామన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి డాక్టర్ ముని రామకృష్ణ, అకడమిక్ డీన్ ఎం.శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, క్యాంపస్-2 ఇన్‌చార్జి సాగర్ పాల్గొన్నారు.