Share News

అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:01 AM

అమరావతి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకురావాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు.

అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
మాట్లాడుతున్న బగ్గు రమణమూర్తి :

నరసన్నపేట, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): అమరావతి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకురావాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా పేర్కొంటూ పార్లమెంట్‌లో కేంద్రప్రభుత్వం బిల్లును ఆమోదించడంతో హర్షం వ్యక్తంచేశారు. శనివారం నరసన్నపేటలో విలేకరులతో మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం కేవలం పరిపాలనా కేంద్రం ఏర్పాటుకే పరిమితం కాకుండా, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందన్నారు. ఆధునిక సదుపాయాలతో కూడిన రాజధాని నిర్మాణం వల్ల దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం కలుగుందన్నారు. కార్యక్రమంలో నియోజవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, బైరి భాస్కరరావు, ఎంవీ నాయుడు, వెలమల రాజేంద్రనాయుడు, కత్తిరి వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2026 | 12:01 AM