Share News

అమరావతి దేవతల రాజధాని

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:15 AM

రాజధానిగా గుర్తిస్తూ చట్టం చేయబడిన అమరావతి దేవతల రాజధాని అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

అమరావతి దేవతల రాజధాని
ఎచ్చెర్ల: కేక్‌ కట్‌ చేస్తున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): రాజధానిగా గుర్తిస్తూ చట్టం చేయబడిన అమరావతి దేవతల రాజధాని అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఎస్‌ఎస్‌ఆర్‌ పురంలో శుక్రవారం ప్రజా దర్బార్‌ నిర్వహిం చారు. అమరావతి రాజధానికి మద్దతుగా కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. రైతుల త్యాగంతో ఏర్పడిన అమరావతిని మార్చేందుకు వైసీపీ పాలనలో ఎంతో ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అమరావతికి చట్టబద్ధత కలిగిందని చెప్పారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి అమరావతి రాజ ధాని వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఫోన్‌లో ఆదేశిచారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ అన్నెపు భువనేశ్వరరావు, టీడీపీ ఎచ్చెర్ల, లావేరు మండల అధ్యక్షులు బెండు మల్లేశ్వరరావు, ముప్పిడి సురేష్‌, నేతలు గాలి వెంకటరెడ్డి, కొత ్తకోట అమ్మి నాయుడు, అల్లుపల్లి రాంబాబు, మూకళ్ల భాస్కరరావు, గోపిన కృష్ణప్రసాద్‌, గాడు రామారావు తదిత రులు పాల్గొన్నారు.

పట్టణంలో అమరావతి సంబరాలు

పార్లమెంట్‌ ఆమోదం హర్షణీయం: అశోక్‌

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజఽ దానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభ ఆమోదించడంపై హర్షం వ్యక్తంచేస్తూ పట్టణంలో శుక్రవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశ పెట్టిన రాష్ట్ర పునర్వి భజన చట్టం సవరణకు పార్లమెంట్‌ ఆమోదం తెలపడం ఆనందదాయకమని, ఇది ఆంధ్రుల పాలిట వరమని అన్నారు. బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు. పాత బస్టాండ్‌ ఎర్రన్నాయుడు కూడలి వద్ద నుంచి రాజధాని అమరావతి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ దాసన్నపేట జంక్షన్‌ వరకు కాగడా లతో ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పత్రి తవిటయ్య, ఎన్‌.కోటి, కొండా శంకర్‌రెడ్డి, కాళ్ల జయదేవ్‌, నందికి జాని, రెయ్యి జానికిరావు, ఏఎంసీ చైర్మన్‌ ముణిచంద్ర ప్రకాష్‌, జడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు శ్రీనివాసరౌలో తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 12:15 AM