‘అల్లూరి’ త్యాగం స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Jul 04 , 2026 | 11:50 PM
స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని శనివారం జిల్లా పోలీస్ కార్యా లయంలో నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతం త్య్ర సంగ్రామ చరిత్రలో అల్లూరి సీతారామరాజు పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. బ్రిటిష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా గిరి జనులను చైతన్యవంతం చేసి విప్లవయోధుడిగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. దేశం కోసం 27 ఏళ్ల వయసులోనే అమరత్వం పొందిన మహోన్నత వ్యక్తి సీతారామరాజు అని, ఆయన త్యాగం ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీ ఎల్.శేషాద్రి, ఏవో సీహెచ్ గోపీనాఽథ్, సీఐలు ఈశ్వర్ ప్రసాద్, శ్రీనివాస్, ఆర్‌ఐ నరసింగరావు, పోలీస్ అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు.