బాలల ఆరోగ్యంతోనే సర్వతోముఖాభివృద్ది
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:49 PM
బాలలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారి విద్యాభ్యాసంతో పాటు శారీరక, మానసిక అభివృద్ధికి అవకాశం కలుగు తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కల్చరల్, సెస్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): బాలలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారి విద్యాభ్యాసంతో పాటు శారీరక, మానసిక అభివృద్ధికి అవకాశం కలుగు తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శ్రీకాకుళం ఎచ్చెర్ల వీధి ఆదర్శ ప్రాథమిక పాఠశాల, గీతాంజలి పాఠశాలల్లో సోమవారం చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ స్వయంగా మింగించారు. జాతీయ నులి పురుగుల దినం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల్లో నులిపురుగుల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. డీఎంహెచ్‌వో ఈవీఎన్ నరేష్‌కుమార్, రాష్ట్ర మానిటరింగ్ అధికారి బొడ్డేపల్లి మీనాక్షి, రాష్ట్రీయ బాలలస్వస్థత కార్యక్రమ ప్రాజెక్టు ఆఫీసర్ కె.శివరంజని, డీఈవో రవి బాబు, వైద్యాధి కారులు డా.క్రాంతి కుమార్, డా.నీలిమ తదితరులు పాల్గొన్నారు. నగరం లోని ఎచ్చెర్ల వీధిలోని ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలకు కలెక్టర్ స్వయం గా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి, నులిపురుగుల నిర్మూలన దినం కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి’
విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతై శ్రద్ధ వహించాలని ఎన్‌డీడీ రాష్ట్ర పరిశీలకులు బొడ్డేపల్లి మీనాక్షి సూచించారు. జిల్లాలో సోమవారం అమలుచేసిన జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని ఆమె పరిశీలించారు. పొన్నాడ పీహెచ్‌సీ పరిధిలోని పొన్నాడ కేజీబీవీ, కొయ్యాం జూనియర్ కాలేజి, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి అక్కడి చిన్నారులకు ఆల్బెం డజోల్ మాత్రల పంపిణీని పరిశీలించారు. వైద్యాధికారి షేక్ ఛాందిని తదితరులు పాల్గొన్నారు.