Share News

కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:26 AM

Kendriya Vidyalayam.. Allotment రాష్ట్ర ప్రభుత్వం పలాసలో నిర్మించతలపెట్టిన కేంద్రీయ విద్యాలయానికి పురుషోత్తపురం రెవెన్యూ పరిధిలో రూ.32 కోట్లు విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జీవో నెంబరు: 139 శుక్రవారం విడుదల చేసింది.

కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు
పురుషోత్తపురం రెవిన్యూ పరిధిలో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన ప్రభుత్వ భూములు

ఫలించిన ఎమ్మెల్యే శిరీష కృషి

పలాస, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పలాసలో నిర్మించతలపెట్టిన కేంద్రీయ విద్యాలయానికి పురుషోత్తపురం రెవెన్యూ పరిధిలో రూ.32 కోట్లు విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జీవో నెంబరు: 139 శుక్రవారం విడుదల చేసింది. పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో కలిసి ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్ర కృషి చేశారు. కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి కేంద్రమంత్రి అనుమతి తీసుకువచ్చారు. సూదికొండ వెనుకభాగంలో ఉన్న ప్రభుత్వ భూమిని విద్యాలయానికి కేటాయించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తు భూమిని కేంద్రీయ విద్యాలయానికి బదలాయించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ పలాస డివిజన్‌ ప్రజలకు కేంద్రీయ విద్యాలయం ఎంతో వినియోగపడుతుందన్నారు. విద్యాలయం ఏర్పాటుకు కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Feb 28 , 2026 | 12:26 AM