‘అభివృద్ధి పనులకు స్థలాలను కేటాయించండి’
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:13 AM
ప్రభుత్వం చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థలాలను కేటాయించాలని రెవెన్యూ అధికారులను టెక్కలి ఆర్డీవో ఎన్. కృష్ణమూర్తి సూచించారు.
కోటబొమ్మాళి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థలాలను కేటాయించాలని రెవెన్యూ అధికారులను టెక్కలి ఆర్డీవో ఎన్. కృష్ణమూర్తి సూచించారు. శనివారం స్థానిక కొత్తమ్మతల్లి ఆలయ అభివృద్ధి పనులకోసం ఆలయ పరిసరాల్లోని స్థలాన్ని పరిశీలించారు. ఆలయ అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్న పీఏసీఎస్ కార్యాలయాన్ని తొలగించి ఎంపీ డీవో కార్యాలయం ఎదురుగా స్థలాన్ని కేటాయిస్తే అక్కడ ప్రభుత్వం భవనాలు నిర్మిస్తుందని సూచించారు. డిగ్రీ కళాశాల నిర్మాణానికి దండుమెరకలో ఉన్న ప్రభుత్వస్థలాన్ని కూడా పరిశీలించారు. అనంతరం కొత్తమ్మతల్లి ఆలయ కార్యాలయంలో గ్రామపెద్దలు, అధికారులతో అభివృద్ధి పనులు పై సమీక్షించారు. కార్యక్రమంలో కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, టీడీపీ మండలాధ్యక్షుడు బోయిన రమేష్, ఆలయకమిటీ చైర్మన్ కోరాడ గోవిందరావు, ఈవో రాధాకృష్ణ, తహసీల్ధార్ ప్రసాదరావు పాల్గొన్నారు.