ఇళ్ల స్థలాలు కేటాయించండి
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:32 AM
ఆఫ్‌షోర్ రిజర్వా యర్ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని బాధితులు కోరారు.
ఎమ్మెల్యే గౌతు శిరీషను కోరిన ఆఫ్‌షోర్ నిర్వాసితులు
ప్రజా దర్బార్‌లో వినతులు స్వీకరణ
పలాస, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ఆఫ్‌షోర్ రిజర్వా యర్ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని బాధితులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే గౌతు శిరీషను రేగులపాడు గ్రామ స్థులు కలిసి విన్న వించారు. ఎమ్మెల్యే కార్యా లయంలో గ్రీ వెన్స్ నిర్వ హించగా.. నిర్వాసి తులు తమకు స్థలాలు కేటా యించి ఆదుకో వాలన్నారు. 50 మంది వరకూ నిర్వా సితులకు గృహాలు కట్టు కోవడానికి స్థలాలు ఇవ్వ లేదన్నారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారుల దృష్టికి ఈ సమస్య తీసుకు వెళ్లి పరిష్క రిస్తామన్నారు. అదేవిధంగా మామిడిపల్లి గ్రా మానికి చెందిన జె.రామారావుకు సీఎం సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే అందించారు. అనంతరం పలాస నియోజకవర్గం వివిధ మండలాలు, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటి నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లా గ్రంఽథాలయసంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు, టీడీపీ నాయకుడు కొర్ల కన్నారావు తదితరులు ఉన్నారు.