Share News

అభివృద్ధికి కేరాఫ్‌ కూటమి పాలన

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:55 PM

: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిం దని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ అన్నారు.

అభివృద్ధికి కేరాఫ్‌ కూటమి పాలన
సీసీ రోడ్లు, కాలువల ప్రారంభ శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిం దని రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవి కుమార్‌ అన్నారు. అక్కి వరం గ్రామ పంచా యతీలో రూ.1.25 కోట్లు ఉపాధి నిధులతో నిర్మిం చిన ఆరు సీసీ రోడ్లు, కాలువలను బుధ వారం ప్రారంభించారు. రైతులకు పట్టాదారు పాస్‌పుస్త కాలను పంపిణీ చేశారు. అనంతరం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకా లను వివరించారు. ఆమదాలవలస నియోజక వర్గంలో సుమారు రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత, రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తమ్మినేని చంద్ర శేఖర్‌, నారాయణపురం ఆనకట్ట చైర్మన్‌ సనపల ఢిల్లీశ్వరరావు, టీడీపీ నాయకులు తాండ్ర హరి, హనుమంతు బాలకృష్ణ, బుడుమూరు సీతారాం, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మండల పరిషత్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 11:55 PM