రాష్ట్రాభివృద్ధికి కూటమి బాటలు
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:50 PM
రాష్ట్రంలో వైసీపీ హయాంలో జరిగిన వినాశనం నుంచి కూటమి ప్రభుత్వం వికాసం వైపు అడుగులు వేసి పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా విజయోత్సవాన్ని శనివారం రామయ్యపుట్టుగలో నిర్వ హించారు.
ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్
కవిటి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ హయాంలో జరిగిన వినాశనం నుంచి కూటమి ప్రభుత్వం వికాసం వైపు అడుగులు వేసి పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా విజయోత్సవాన్ని శనివారం రామయ్యపుట్టుగలో నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేక ఎంతగా వెనుక బడ్డామో అందరికీ తెలిసిందేనన్నారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం లేక, మరమ్మతులు చేపట్టక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వ ర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపడుతూనే గ్రామాల్లో కనీస సదు పాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రజలకు మంచి చేస్తున్నా వైసీపీ నేతలు మాత్రం బురద జల్లుతూ అరాచకాలు సృష్టించాలని యత్నాలు చేయడం దారుణమన్నారు. అందువల్ల కూటమి నేతలు, కార్యకర్తలు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశం జరుగుతుండగా వర్షం కురవడంతో కొంతసేపు అంతరాయం కలిగింది. కార్యక్ర మంలో టీడీపీ మండల అధ్యక్షులు పి. కృష్ణారావు, ఎం.రామారావు, ఎల్.పద్మనాఽభం, ఎం.కుమార్, జనసేన ఇన్ చార్జి దాసరి రాజు, పలువురు నేతలు పాల్గొన్నారు.