Share News

రెండో విడతలోనూ కూటమి హవా

ABN , Publish Date - Nov 30 , 2026 | 12:41 AM

81.06% voter turnout across 13 mandals జిల్లాలో రెండో విడత పంచాయతీ పోరులోనూ కూటమి హవా కొనసాగింది. ఎక్కువ పంచాయతీల్లో కూటమి పార్టీల మద్దతుదారులు సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిచారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం, లావేరు, ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, కొత్తూరు, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో ఆదివారం పోలింగ్‌ నిర్వహించారు.

రెండో విడతలోనూ కూటమి హవా
హిరమండలం మేజర్‌ పంచాయతీ పోలింగ్‌ కేంద్రం వద్ద బారులుదీరిన ఓటర్లు

  • పంచాయతీ పోరులో అత్యధిక మద్దతుదారులు ఎన్నిక

  • 13 మండలాల్లో 81.06 శాతం పోలింగ్‌

  • ఓటింగ్‌లో అధికంగా పాల్గొన్న మహిళలు

  • శ్రీకాకుళం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత పంచాయతీ పోరులోనూ కూటమి హవా కొనసాగింది. ఎక్కువ పంచాయతీల్లో కూటమి పార్టీల మద్దతుదారులు సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిచారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఎచ్చెర్ల, జి.సిగడాం, రణస్థలం, లావేరు, ఆమదాలవలస, బూర్జ, పొందూరు, సరుబుజ్జిలి, కొత్తూరు, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల్లో ఆదివారం పోలింగ్‌ నిర్వహించారు. రెండో విడత కింద ఈ 13 మండలాల్లో మొత్తం 388 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలతోపాటు 3,618 వార్డులు ఉన్నాయి. ఇందులో 46 పంచాయతీలు, 1,090 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ నేపథ్యంలో 342 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు, 2,562 వార్డుల్లో సభ్యుల స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్‌ ప్రక్రియ సాగింది.

  • జిల్లాలోని 13 మండలాల పరిధిలో 342 పంచాయతీల్లో జరిగిన ఎన్నికలకు 81.06 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 5,67,478 మంది ఓటర్లకు గాను 4,60,023 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2,27,391 మంది, మహిళలు 2,32,630 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 5,239 మంది అధికంగా ఓటు వేయడం విశేషం.

  • మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. ఫలితాలను వెల్లడించారు. కొన్ని పంచాయతీల్లో అర్ధరాత్రి వరకూ ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. ఇందులో అత్యధిక సర్పంచ్‌, వార్డుల స్థానాలు కూటమి మద్దతుదారులకు దక్కాయి. మొత్తం 388 సర్పంచ్‌ స్థానాల్లో టీడీపీ మద్దతుదారులకు 46 స్థానాలు ఏకగ్రీవమ య్యాయి. మిగిలిన 342 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా.. టీడీపీ మ ద్దతుదారులు 181, బీజేపీకి ఏడు, జనసేనకు 12 స్థానా లు దక్కాయి. ఇక వైసీపీ మద్దతుదారులు 88 మంది, ఇతరులు 28 మంది అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోంది.

  • మండలాల వారీగా... పోలింగ్‌ ఇలా..

  • -----------------------------------------------------

  • మండలం పోలైన ఓట్లు శాతం

  • -------------------------------------------------------------

  • లావేరు 38,785 86.83

  • రణస్థలం 56,152 86.66

  • సరుబుజ్జిలి 21,831 85.45

  • ఆమదాలవలస 32,381 84.79

  • బూర్జ 29,394 84.30

  • జి.సిగడాం 36,196 84.23

  • ఎచ్చెర్ల 53,188 81.90

  • ఎల్‌.ఎన్‌.పేట 17,814 81.06

  • పొందూరు 46,169 79.67

  • కొత్తూరు 42,466 77.27

  • మెళియాపుట్టి 29,578 77.06

  • హిరమండలం 22,171 74.56

  • పాతపట్నం 33,898 69.90

  • పోలింగ్‌ ప్రశాంతం: ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

  • ‘జిల్లాలోని 13 మండలాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా ఓటుహకును వినియోగించుకున్నార’ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఎచ్చెర్ల మండలంలోని ఇబ్రహీంబాద్‌, ఫరీదుపేట, కేశవరావుపేట, ఎస్‌ఎంపురం, పొందూరు మండలం దల్లిపేట, కంచరాం, లోలుగు తదితర గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్‌ సరళిని ఎస్పీ పరిశీలించారు. పోలింగ్‌ ప్రక్రియను డ్రోన్లు, సీసీ కెమేరాలు ద్వారా పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టారు. జిల్లాలోని 134 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అదనపు బలగాలను మోహరించామని ఎస్పీ తెలిపారు. పోలీస్‌ బందోబస్తు మధ్య కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభించామన్నారు. లెక్కింపు పూర్తయిన తర్వాత ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడం, బహిరంగ సంబరాలకు అనుమతి లేదన్నారు.

Updated Date - Nov 30 , 2026 | 12:41 AM