Share News

కేసుల నుంచి తప్పించుకోవడానికే ఆరోపణలు

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:22 AM

టెక్కలికి చెందిన కె.తరుణ్‌కుమార్‌పై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికే సోషల్‌ మీడియా, ఫేస్‌బుక్‌ వేదికగా పోలీసులపై ఆ రోపణలు చే స్తున్నారని డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు.

 కేసుల నుంచి తప్పించుకోవడానికే ఆరోపణలు
మాట్లాడుతున్న డీఎస్పీ లక్ష్మణరావు

టెక్కలి, జూలై 11(ఆంధ్రజ్యోతి): టెక్కలికి చెందిన కె.తరుణ్‌కుమార్‌పై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికే సోషల్‌ మీడియా, ఫేస్‌బుక్‌ వేదికగా పోలీసులపై ఆ రోపణలు చే స్తున్నారని డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. శని వారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తరుణ్‌ కుమార్‌ తరచూ సోషల్‌ మీడియా వేదికగా టెక్కలి సీఐ విజయ్‌కుమార్‌పై నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచిది కాదని తెలిపారు. టెక్కలి పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్‌గా ఉన్నారని, ఇటీవల నేరాలకు పాల్పడుతుండడంతో ఆయనపై పోలీసులు నిఘా ఉంచారని తెలిపారు. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికే పోలీసులను భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారని తెలిపారు. 2002లో ఒక మిక్చర్‌ తయారుచేస్తున్న వ్యక్తిని భయపెట్టి రూ.8వేలు దోచుకున్నాడని తెలిపారరు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పపట్లో అరెస్టు చేసినట్టు తెలిపారు. ఆ కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని తెలిపారు. 2023లో కూడా అక్కవరం రవి దాబా వద్ద మోటార్‌సైకిల్‌ పై వెళ్తున్న వ్యక్తిని భయపెట్టి రూ.30వేలు దోచుకున్నాడని తెలిపారు. ఇటీవల కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు పేరుతో ఫేస్‌బుక్‌లో ఫేక్‌అకౌంట్‌ ఓపెన్‌ చేసి రూ.30లక్షల వరకు దోచుకున్నాడని వివరించారు. దీనిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. నేరచరిత్ర గల వ్యక్తి పోలీసులపై తరచూ సోషల్‌మీడియాలో అనుచిత వ్యాఖ్యల చేయడం మంచిది కాదన్నారు. చట్ట ప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారని తెలిపారు. ఆయనతో పాటు టెక్కలి సీఐ విజయ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 12:22 AM