Share News

నలుగురూ హెల్మెట్లు ధరించి...

ABN , Publish Date - May 12 , 2026 | 12:45 AM

అది శ్రీకాకుళం పట్టణంలోని అంబేడ్కర్‌ జంక్షన్‌. సోమవారం సాయంత్రం ట్రాఫిక్‌ పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు.

నలుగురూ హెల్మెట్లు ధరించి...
నలుగురు హెల్మెట్లు ధరించిన దృశ్యం

శ్రీకాకుళం క్రైం, మే 11(ఆంధ్రజ్యోతి): అది శ్రీకాకుళం పట్టణంలోని అంబేడ్కర్‌ జంక్షన్‌. సోమవారం సాయంత్రం ట్రాఫిక్‌ పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో ఒక స్కూటర్‌పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన భార్యభర్తలు, ఇద్దరు చిన్నారులు అందరూ హెల్మెట్‌ ధరించడం పోలీసుల దృష్టిని ఆకర్షించింది. వాహనదారుడిని వివరాలు అడుగగా.. తన పేరు రమేష్‌ అని... ఎలక్ర్టీషియన్‌గా పని చేస్తున్నానని తెలిపారు. ఎస్పీ ప్రారంభించిన హెల్మెట్‌ బ్యాంకు కార్యక్రమంతో అవగాహన కలిగిందని... కుటుంబ సభ్యుల భద్రతే ముఖ్యమని భావించి అందరం హెల్మెట్‌ ధరించి ప్రయాణిస్తున్నామని వారికి తెలిపారు.

Updated Date - May 12 , 2026 | 12:45 AM