భక్తులకు అన్ని సదుపాయాలు
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:02 AM
రథసప్తమికి భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
అరసవల్లి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): రథసప్తమికి భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. అరసవల్లి దేవస్థానంలో నిర్వహిం చనున్న రథసప్తమి వేడుకలకు సంబంధిం చిన ఏర్పాట్లను బుధ వారం ఎస్పీ మహేశ్వర రెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. భక్తులకు సులభంగా శీఘ్ర దర్శనం లభించే విధంగా తీసుకో వాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. భక్తులు, వీఐపీలు, వీవీఐపీలు, దాతలు దర్శనాలకు ప్రత్యేక క్యూలైన్లు, భక్తులకు క్యూలైన్‌లో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల ఏర్పాటు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మీడియాతో మాట్లాడు తూ.. ఏడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని భావించామని, అయితే అనివార్య కారణాల వల్ల మూడురోజుల పాటు ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆర్డీవో సాయి ప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్, ఉత్సవాల ప్రత్యేక అధికారి శోభారాణి తదిత రులు ఆలయం లోపల, వెలుపల చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.