Share News

ఉపాధి బిల్లులన్నీ అప్‌లోడ్‌ చేయాలి

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:12 PM

జిల్లాలో ప్రగతిలో ఉన్న ఉపాధి హామీ పనులను యుద్ధప్రాతి పదికన పూర్తిచేసి, బిల్లు లన్నీ అప్‌లోడ్‌ చేయాలని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కృష్ణతేజ అధికా రులను ఆదేశించారు.

ఉపాధి బిల్లులన్నీ అప్‌లోడ్‌ చేయాలి
మాట్లాడుతున్న కమిషనర్‌ కృష్ణతేజ

- పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ

శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రగతిలో ఉన్న ఉపాధి హామీ పనులను యుద్ధప్రాతి పదికన పూర్తిచేసి, బిల్లులన్నీ అప్‌లోడ్‌ చేయాలని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కృష్ణతేజ అధికా రులను ఆదేశించారు. బుధవారం నగరంలోని ఓ కల్యాణమండపంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో కలిసి ఉపాధి హామీ పనులు, నిధుల వ్యయంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని 912 పంచాయతీల్లో 2017 నుంచి ఇప్పటివరకు సుమారు 13,839 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వాటిని తక్షణమే పూర్తిచేయాలన్నారు. 2025- 26 సంవత్సరానికి సంబం ధించి సుమారు రూ.214కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. మార్చి 15నాటికి బిల్లుల ప్రక్రియను పూర్తిచేసి, పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. డ్వామా పీడీ లవరాజు మాట్లాడుతూ ఇప్పటికే రూ.111.72కోట్ల బిల్లులను అప్‌లోడ్‌ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సత్యనారాయణ, గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్లు, వివిధ మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:12 PM