అర్హులంతా ఓటర్లగా నమోదు కావాలి
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:53 PM
అర్హత ఉన్నవారంతా ఓటర్లగా నమోదు కావాలని పలాస ఆర్డీవో, మునిసిపల్ ప్రత్యేకాధికారి అప్పలరాజు ఆదేశించారు.
పలాస, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్నవారంతా ఓటర్లగా నమోదు కావాలని పలాస ఆర్డీవో, మునిసిపల్ ప్రత్యేకాధికారి అప్పలరాజు ఆదేశించారు. మునిసిపల్ కార్యాలయంలో ఒకటో వార్డు మొగిలిపాడుకు చెందిన ఓటర్ల జాబితాలో 300 మంది తొలగిపోయిన నేపధ్యంలో ప్రత్యేక కౌంటరు ఏర్పాటుచేసి ఓటు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వ్యవహారంపై ఆర్డీవో నమోదు కేంద్రానికి వచ్చి ఓటర్లతో మాట్లాడారు. ఆయన వెంట కమిషనర్ ఇ.శ్రీనివాసులు, సిబ్బంది ఉన్నారు.