Share News

క్షేత్రస్థాయిలో ప్రజల అప్రమత్తం

ABN , Publish Date - Oct 28 , 2026 | 12:24 AM

తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీర, లోతట్టు ప్రాంతాలు, నాగావళి, వంశ ధార నదీ పరీవాహక గ్రామాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో ప్రజల అప్రమత్తం

ఎస్పీ ఆదేశాలతో గ్రామాల్లో పోలీసు అధికారులు

శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీర, లోతట్టు ప్రాంతాలు, నాగావళి, వంశ ధార నదీ పరీవాహక గ్రామాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇతర శాఖల అధికారుల సమన్వయంతో అత్యవసర సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు నదులు, వాగులు, నీటితో నిండిన కల్వర్టుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. జిల్లాలో నది పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాలైన రణస్థలం, ఎచ్చెర్ల, గార, వజ్రపుకొత్తూరు, పోలాకి, సోంపేట మండలాలతో పాటు నాగావళి, వంశఽధార నదిపరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాలపై పోలీసులు దృష్టిసారించారు. అధికారుల హెచ్చరికలను పాటిస్తూ అప్ర మత్తంగా ఉండాలని కోరుతున్నారు. తుఫాన్‌ ప్రభావాన్ని సమర్ధ వంతం గా ఎదుర్కొనేందుకు జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఇతర శాఖల సమన్వయంతో ముందుస్తు చర్యలు చేపడు తున్నారు.

‘ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి’

కంచిలి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు, వేగంగా గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సోంపేట సీఐ బి.మంగరాజు, కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు ఒక ప్రకటనలో కోరారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు, హోర్డింగ్‌ల సమీపంలో ఉండవద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్నారు. పోలీసులు, సంబంధిత అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

‘నదులు, చెరువుల వద్దకు వెళ్దొద్దు’

ఆమదాలవలస, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభా వంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున లోత ట్టు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ సనపల బాల రాజు సూచించారు. మంగళవారం నిమ్మతొర్లాడ, సిరిసిం పేట, కొత్తవలస, ముద్దాడపేట గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగా హన కలిగించారు. నాగావళి నదిలో వరద ఉధృతి పెరిగే ప్రమాదం ఉ న్నందున నదులు, వాగులు, చెరువులు సమీపంలోకి వెళ్లవద్దన్నారు. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 112 లేదా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 63099 90933 సమాచారం అందించాలని ఎస్‌ఐ సూచించారు.

Updated Date - Oct 28 , 2026 | 12:24 AM