సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:57 PM
సీజన్‌లో వ్యాధులపై అప్రమ త్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఎంహెచ్‌వో నరేష్ కుమార్ అన్నారు. బుధవారం గార పీహెచ్‌సీని తనిఖీ చేశారు.
డీఎంహెచ్‌వో డా.నరేష్‌కుమార్
గార, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): సీజన్‌లో వ్యాధులపై అప్రమ త్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని డీఎంహెచ్‌వో నరేష్ కుమార్ అన్నారు. బుధవారం గార పీహెచ్‌సీని తనిఖీ చేశారు. గ్రామా ల్లో ప్రజ లకు పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, ఆరోగ్యంపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కలిగించా లన్నారు. అవసరమైతే గ్రామాల్లో మెడికల్ క్యాంప్‌లు నిర్వహించాలన్నారు. రికార్డులను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. అనంతరం జాతీయ పంచాయతీగా ఎంపికైన బోరవానిపేట గ్రామాన్ని సందర్శించి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. కార్యక్రమంలో వైద్యాధికారి పి.సోనియా, సిబ్బంది పాల్గొన్నారు.