లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:33 AM
జిల్లా యంత్రాంగం బంగాళాఖాతంలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంచేసింది. ఈమేరకు రెవెన్యూ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు.
పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధం
జిల్లాలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు చర్యలు
జిల్లా యంత్రాంగం బంగాళాఖాతంలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంచేసింది. ఈమేరకు రెవెన్యూ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. అవసరమైన చోట పునరావాసకేంద్రాల ఏర్పాటుకు సన్న ద్ధమవుతున్నారు. తీరప్రాంతంలోని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
ఫనందిగాం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ఉయ్యాలపేటలో తుఫాన్ ప్రభావంతో నెలకొనే సమస్యలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని తహసీల్దార్ పెద్దింటి సోమేశ్వరరావు సూచించారు.లోతట్టు ప్రాంతమైన ఉయ్యాలపేటను అధికారులు సంద ర్శించారు. గ్రామస్థులకు పునరావాసం, భోజనాలఏర్పాటుపై చర్చించారు.
వజ్రపుకొత్తూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎవ్వరు సముద్రంలో చేపలవేటకు వెళ్లరాదని తహసీల్దార్ బీవీ సీతారామయ్య సూ చించారు. మండలంలో వివిద తీరప్రాంత గ్రామాలను పరిశీలించి మత్స్యకారులతో మాట్లాడారు. కార్యక్రమంలో డీటీ శ్రావన్‌కుమార్ పాల్గొన్నారు.
ఎల్.ఎన్.పేట, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): తుఫాన్ దృష్ట్యా గ్రామాల్లో ప్రాణ, ఆర్థిక నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేకాధి కారి టి.జనార్దనరావు తెలిపారు. ఎల్.ఎన్.పేటలో అధికారులతో సమావేశం నిర్వహిం చారు. సమావేశంలో తహసీల్దార్ జె.ఈశ్వరమ్మ, ఎంపీడీవో శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో గోవిందరావు, డీటీ నీలిమ, ఏవో కిరణ్‌వాణి, మణికుమార్ పాల్గొన్నారు.