Share News

మెళియాపుట్టిలో రసాభాస

ABN , Publish Date - Nov 30 , 2026 | 12:39 AM

మెళియాపుట్టిలోని ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం శనివారం రసాభాసగా మారింది.

మెళియాపుట్టిలో రసాభాస
కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యం

మెళియాపుట్టి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మెళియాపుట్టిలోని ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రం శనివారం రసాభాసగా మారింది. మెళియాపుట్టి సర్పంచ్‌ అభ్యర్థులుగా దుక్క ఉషారాణి, ఎరుసు పూర్ణిమ పోటీ చేశారు. వీరిద్దరూ స్వతంత్ర అభ్యర్థులే. ఉషారాణికి 1183 ఓట్లు రాగా, పూర్ణిమకు 1031 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఉషారాణి 152 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికా రులు ప్రకటించారు. దీంతో పూర్ణిమ వర్గీయులు కౌంటింగ్‌ కేంద్రం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. కౌంటింగ్‌ జరుగుతున్న సమయంలో ఉషారాణి వర్గీయులు విద్యుత్‌ అంతరాయం కలిగించి ఓట్లు కలిపారంటూ ఆరోపించారు. ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతుండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎస్‌ఐ మహ్మద్‌ ఆలీ తన సిబ్బందితో పాటు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. మళ్లీ రీకౌంటింగ్‌ చేయాలని పూర్ణిమ వర్గీయులు కోరడంతో ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Updated Date - Nov 30 , 2026 | 12:39 AM