Share News

వ్యవసాయం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక: ఎమ్మెల్యే

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:20 AM

వ్యవసాయమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

 వ్యవసాయం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక: ఎమ్మెల్యే
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిరీష

హరిపురం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. బాలిగాం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో శనివారం రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నిరంతర సాంకేతిక సేవలు అందించాలని సూచించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అందించే సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని అన్నారు. మందస మండలానికి మొదటి విడతలో 500టన్నులు ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు అధర్య పడొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏడీ వై.శారద, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ పీరుకట్ల విఠల్‌, ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ భావన దుర్యోధన, ఎంపీడీవో వై.వెంకటరమణ, తహసీల్దార్‌ బి.శ్రీహరిరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు తమిరి భాస్కరరావు, లబ్బ రుద్రయ్య, సాలిన మాధవరావు, రట్టి లింగరాజు, బైరిశెట్టి గున్నయ్య, కె.వైకుంఠరావు, మండల లచ్చయ్య, బమ్మిడి కర్రయ్య, ఆర్‌.రమ్య, తాతారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 12:20 AM