వరద నీటిలోనే ఇంకా పంట పొలాలు
ABN , Publish Date - Nov 03 , 2026 | 12:04 AM
మండలంలోని గుమ్మగెడ్డ పరీవాహక ప్రాంతంలోని సీది, తామర, తీమర, పాశిగంగుపేట తది తర గ్రామాల్లో ఇంకా వరి పంట వరద నీటిలోనే తడిసిము ద్దవుతోంది.
పాతపట్నం, నవంబరు2(ఆంధ్రజ్యోతి): మండలంలోని గుమ్మగెడ్డ పరీవాహక ప్రాంతంలోని సీది, తామర, తీమర, పాశిగంగుపేట తది తర గ్రామాల్లో ఇంకా వరి పంట వరద నీటిలోనే తడిసిము ద్దవుతోంది. ఇటీవల ఆర్నబ్ తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు అన్ని గ్రామాల్లో పంటలు నీటముంపునకు గురైన విషయం విదితమే. ఇంతలోనే సోమవారం కూడా వర్షాలు కురవడంతో రైతుల్లో ఆందో ళనలో నింపాయి. తుఫాన్ అనంతరం పొలాల్లో నెమ్మదిగా వరద మళ్లించి పంటలను రక్షించుకోవాలన్న ఆలోచనలో రైతులు ఉన్నారు. ఈ సమయంలో మరో తుఫాన్ వల్ల వర్షాలు కురుస్తుండడంతో పంటలు పాడవుతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.