డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:18 AM
న్యాయమైన డి మాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు హెచ్చరించారు.
బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక హెచ్చరిక
పాత శ్రీకాకుళం సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): న్యాయమైన డి మాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం విశాఖ-బి కాలనీ సమీపంలోని ఎస్‌బీఐ ఎదుట ఆయా సంఘాల నేతలు, సిబ్బంది నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూ ఎఫ్‌బీఎఫ్ కన్వీనర్ సీహెచ్ వెంకట రమణ మాట్లాడుతూ.. బ్యాంకు ల్లో ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని, ఆర్థిక ప్రోత్సాహకా లు అధికారులు, సిబ్బందికి ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోవాల న్నారు. వర్క్‌మెన్ డైరెక్టర్ నియామకాలు చేపట్టాలని, సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గేలా నియామకాలు చేపట్టాలన్నారు. పనిఒత్తిడి తగ్గేలా నియామకాలు చేపట్టాలని దిమాండ్ చేశారు. ఇతర నాయకులు మండా శ్రీనివాసరావు, కృష్ణకిషోర్ మాట్లాడుతూ.. తరచూ బ్యాంకుల విలీనం వల్ల ఉద్యోగుల్లో సమతుల్యత దెబ్బతింటోందని, దీనిని సరిచేయాలని కోరారు.
ఆదివారం పనిచేస్తాయి..
ఇదిలా ఉండగా బ్యాంకు ఉద్యోగులు ఈనెల 28, 29, 30 తేదీల్లో సమ్మెకు పిలుపునివ్వడం, 26, 27 బ్యాంకులకు నాల్గో శనివారం, ఆది వారం సెలవులు కలిసివచ్చాయి. అయితే ఆదివారం బ్యాంకులు పని చేయాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సమ్మె వల్ల ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా 27వ తేదీ ఆదివారం జిల్లా లోని అన్ని బ్యాంకులు పనిచేస్తాయని ఆయా బ్యాంకువర్గాలు ధ్రువీ కరించాయి.