కుమారుడ్ని రైలెక్కించి..
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:51 PM
కుమారు డిని రైలెక్కించి ప్రమాదవశాత్తు జారిపడి తండ్రి మృతి చెందిన ఘటన శుక్రవారం ఇచ్ఛాపురంలో సంభవించింది. వివరాలిలా ఉన్నాయి..
ప్రమాదవశాత్తు జారిపడి తండ్రి మృతి
ఇచ్ఛాపురంలో విషాదం
ఇచ్ఛాపురం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కుమారు డిని రైలెక్కించి ప్రమాదవశాత్తు జారిపడి తండ్రి మృతి చెందిన ఘటన శుక్రవారం ఇచ్ఛాపురంలో సంభవించింది. వివరాలిలా ఉన్నాయి.. ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన బూరగాపు రవికుమార్ (60) కుమారుడు చైతన్య చదువు నిమిత్తం ఇతర ప్రాంతంలో ఉంటూ సెలవుల నిమిత్తం వచ్చాడు. తిరిగి వెళ్లేందుకు గాను తండ్రి కుమారుడితో కలిసి శుక్రవారం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. భువనేశ్వర్ నుంచి తిరుపతి వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం మూడు గంటలకు రాగా రైలు వచ్చింది. కుమారుడిని భోగిలోకి ఎక్కించి తాను వెళ్లాడు. రైలు కదలడంతో కిందికి దిగేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. పట్టాల వద్ద పడి పోవడంతో రవికుమార్ కాళ్లు, చేతులు తెగిపడి రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. రవికుమార్ వాచీ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు ఈయనకు భార్య మీనాకుమారి ఉంది. కళ్లముందే తండ్రి మృతి చెంద డంతో కుమారుడు కన్నీరుమున్నీరయ్యాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.