చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:35 PM
పిల్లల దత్తతను చట్ట బద్ధంగా తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరి బాబు అన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం లీగల్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): పిల్లల దత్తతను చట్ట బద్ధంగా తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరి బాబు అన్నారు. జాతీయ న్యాయ సేవా వారోత్సవాల్లో భాగంగా బుధ వారం మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో న్యాయ అవగా హన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రతి పౌరుడికీ ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందని, ఆపదలో ఉన్న బాధితులకు ఎల్లవేళలా న్యాయ సేవాఽధికార సంస్థ పనిచేస్తుం దన్నారు. పోక్సో చట్టం, బాలల హక్కుల పరిరక్షణ వంటి అంశాల్లో క్షేత్ర స్థాయి సిబ్బంది చొరవ చూపి బాధితులకు అండగా నిలబడినప్పుడే చట్టాల అమలు సులభతరం అవుతుందన్నారు. అనంతరం దత్తత, పోస్టర్ కేర్‌పై రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమం లో జిల్లా బాలల రక్షణ అధికారి కేవీ రమణ, న్యాయవాది ఇందిరా ప్రసాద్, బీసీ వెల్ఫేర్, ఐసీడీఎస్ సిబ్బంది, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది పాల్గొన్నారు.