దత్తత కానిస్టేబుళ్లు గ్రామాలు సందర్శించాలి: ఎస్పీ
ABN , Publish Date - May 03 , 2026 | 12:03 AM
దత్తత కానిస్టేబుళ్లు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్య టిస్తూ మహిళా పోలీసులతో సమన్వయం కలిగి ప్రజలతో మమేకమై గ్రామాల్లోని సమస్యలు, గొడవలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు.
రణస్థలం, మే 2 (ఆంధ్రజ్యోతి): దత్తత కానిస్టేబుళ్లు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్య టిస్తూ మహిళా పోలీసులతో సమన్వయం కలిగి ప్రజలతో మమేకమై గ్రామాల్లోని సమస్యలు, గొడవలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. జేఆర్‌పురం పోలీస్ స్టేషన్‌ను శనివారం వార్షిక తనిఖీ చేశా రు. స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ కేంద్రం, రికా ర్డులు, కంప్యూటర్, కేసుల్లో సీజ్ చేసిన ప్రాపర్టీ, నిందితుల గదులను పరిశీలించారు. కేసులక సంబంధించిన సీజ్ చేసిన ప్రాపర్టీ వివరాలతో రికార్డు నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. సిబ్బందితో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. రోడ్డు ఽభద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, హెల్మెట్ వినియోగం, డ్రంకెన్‌డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ వంటి అంశాలపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశువుల అక్రమ రవా ణాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేప ట్టాలని ఆదేశించారు.