Share News

ఏడాది తరువాత అడ్మిషన్లు రద్దు

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:16 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇద్దరు ఎంబీఏ విద్యార్థుల అడ్మిషన్లు రద్దయ్యా యి.

ఏడాది తరువాత అడ్మిషన్లు రద్దు
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం

ఇద్దరు ఎంబీఏ విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకం

వర్సిటీ అధికారుల పర్యవేక్షణ లోపం

ఎచ్చెర్ల రూరల్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇద్దరు ఎంబీఏ విద్యార్థుల అడ్మిషన్లు రద్దయ్యా యి. 2025-26 విద్యాసంవత్సరం ఏంబీఏ స్పాట్‌ అడ్మిష న్లకు ఉన్నత మండలి అనుమతి ఇవ్వలేదు. అయితే ఎటు వంటి అనుమతి లేకపోయినా.. ఐసెట్‌లో ర్యాంకు రాని ఇద్దరు విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. ఏప్రిల్‌లో మొద టి సెమిస్టర్‌ పరీక్ష సైతం నిర్వహించారు. ఫలితాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఆగస్టు నాలుగు నుంచి రెండో సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఫీజు చెల్లింపునకు చివరి రోజు శుక్రవారం కాగా, జ్ఞాన భూమి పోర్టల్‌ సపోర్టు చేయలేదు. దీంతో ఇద్దరు విద్యార్థుల అడ్మిషన్లు రద్దయినట్లు డిపార్ట్‌మెంట్‌లో చెప్పారు. దీంతో ఏడాది పాటు చదివిన తమకు ఇప్పుడు అడ్మిషన్లు రద్దు కావడం ఏమిటని ఆ విద్యార్థులు అధికారులను ప్రశ్నిం చారు. దీంతో వర్సిటీ అధికారులు ఉన్నత విద్యాశాఖను సంప్రదించారు. అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో రిజస్ట్రేషన్‌ కాలేదని వారు స్పష్టం చేయడంతో పాటు మొదటి సెమిస్టర్‌ పరీ క్షలు ఎలా రాయించారని ప్రశ్నించారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా కన్వీనర్‌ కోటాలో మాత్రమే ప్రవేశాలు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ అయ్యాయని, ఈ అడ్మిషన్లు ఎవరు చేశారన్న అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే దీనిపై శుక్రవారం వర్సిటీ అధికారులు సమావేశం నిర్వహించి చర్చించారు. ప్రస్తుతం ఈ అంశం వర్సిటీలో హాట్‌ టాపిక్‌గా మారింది. అక్రమంగా అడ్మిషన్లు ఇవ్వడం, అడ్మి షన్లు రద్దు కావడంతో వర్సిటీ అధికారుల పర్యవేక్షణ లోపం బయటపడింది.

తప్పు జరిగింది..

ఇద్దరికీ ప్రవేశాలు ఎలా జరిగాయో తెలీదు. ఉన్నత విద్యామండలి స్పాట్‌ అడ్మిషన్లకు అనుమతి ఇవ్వలేదు. మొదటి సెమిస్టర్‌లో ఫీజు ఎలా కట్టారో తెలీదు. అడ్మిషన్‌ ఇవ్వకుండా తప్పు జరిగింది. ఈ అంశం ఉన్నతాధికారులు పరిశీలనలో ఉంది. తప్పు ఎవరిదన్న దానిపై విచారణ సాగుతుంది. విద్యార్థుల వైపు నుంచి సైతం తప్పు కనిపిస్తోంది.

-డాక్టర్‌ ఎం.అనురాధ, ప్రిన్సిపాల్‌,

వర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల

Updated Date - Jul 25 , 2026 | 12:16 AM