వైభవంగా ఆదిత్యుని కల్యాణం
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:55 PM
అరసవల్లి సూర్యనారాయణ స్వామివారికి మాఘశుద్ధ ఏకాదశి సందర్భంగా గురువారం వైభవంగా కల్యాణం నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆదిత్యుని ఆలయ అనివెట్టి మండ పంలో అర్చకులు, వేదపండితులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఉషా, ఛాయా, పద్మినీ సమేతంగా స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరి పంచారు.
అరసవల్లి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామివారికి మాఘశుద్ధ ఏకాదశి సందర్భంగా గురువారం వైభవంగా కల్యాణం నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆదిత్యుని ఆలయ అనివెట్టి మండ పంలో అర్చకులు, వేదపండితులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఉషా, ఛాయా, పద్మినీ సమేతంగా స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరి పంచారు. కార్యక్రమంలో ఇప్పిలి సాందీపశర్మ, దర్భముళ్ల శ్రీనివాసశర్మ, ఇప్పిలి షణ్ముఖశర్మ, వికాస్‌శర్మ, పార్థసారథిశర్మ, ఆలయ జూనియర్‌అసిస్టెంట్ బీఎస్ చక్ర వర్తి పాల్గొన్నారు. కాగా సూర్యనారాయణ స్వామివారిని దేవదాయ శాఖ విశ్రాంత కార్యదర్శి గిరిజా శంకర్ గురువారం దర్శించుకున్నారు.
ధర్మవరంలో అఖండ హరినామ సంకీర్తన
ఎచ్చెర్ల, జనవరి 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని ధర్మవరంలో గల రామమంది రంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని 72 గంటలపాటు అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీరామభక్త భజన బృందం, గ్రామస్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మూడురోజుల పాటు ఏకధాటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ముత్యాలపేటలో ఆలయ వార్షికోత్సవం
కవిటి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): ముత్యాలపేటలోని శ్రీమహా మృత్యుంజయేశ్వర స్వామి, ఉపాలయాల ద్వితీయ వార్షికోత్సవం గురువారం నిర్వహించారు. సాయం త్రం భజన కాలక్షేపంతోపాటు సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు. అలాగే లోళ్లపు ట్టుగలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో కళ్యాణమహాత్సవం నిర్వహించారు.
ఫ సరుబుజ్జిలి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): పురుషోత్తపురంలో రంగనాథస్వామి ఆలయంలో 23వవార్షికోత్సవ కళ్యాణం గురువారం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సనపల యతిరాజుదాసు ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు చేశారు.
కాళపర్తిలో మట్ట అచ్చెమ్మ పేరంటాల జాతర
ఆమదాలవలస/బూర్జ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): బూర్జ మండలంలోని కాళ పర్తిలో మట్టఅచ్చెమ్మ పేరంటాలు అమ్మవారిఆలయం 40వ వార్షికోత్సవం పురస్క రించుకుని జాతర గురువారం నిర్వహించారు. ఏటా మాఘమాసం శుక్ల పక్ష ఏకా దశితో ప్రారంభమై మూడురోజులపాటు రాత్రివేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురువారం సత్యహరిశ్చంద్ర పౌరాణిక నాటకం ప్రదర్శించారు.