అంగరంగ వైభవంగా ఆదిత్యుని కల్యాణం
ABN , Publish Date - Mar 29 , 2026 | 11:59 PM
ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అయిన అరసవల్లి శ్రీ సూర్యనారా యణ స్వామివారి వార్షిక కల్యాణం ఆదివారం అంగరంగ వైభ వంగా నిర్వహించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అచ్చెన్నాయుడు
అరసవల్లి, మార్చి 29 (ఆంధ్ర జ్యోతి): ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అయిన అరసవల్లి శ్రీ సూర్యనారా యణ స్వామివారి వార్షిక కల్యాణం ఆదివారం అంగరంగ వైభ వంగా నిర్వహించారు. తొలుత స్వామిని ఉషా, పద్మిని, ఛాయా ఉత్సవ మూర్తులను విశేషాలంకరణతో మాడ వీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని మేళ తాళాలు, చిన్నారుల కోలాట నృత్యాలు, కేరళ డప్పు వాయిద్యాల నడుమ నిర్వహించారు. స్వా మి కల్యాణం సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు.
ఇంద్రపుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై..
తిరువీధి అనంతరం ఇంద్రపుష్కరిణి సమీపంలో నిర్మించిన ప్రత్యేక వేదికపై ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి రోజున వార్షిక కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండి తుల వేద మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం చేపట్టారు. అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొ న్నారు. భక్తుల సౌకర్యార్థం టిక్కెట్ కొనుగోలు యంత్రాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు.