వైభవంగా ఆదిత్యుని చక్రతీర్థ స్నానం
ABN , Publish Date - Apr 03 , 2026 | 12:12 AM
అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా చైత్రశుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం ఆలయ అనివెట్టి మండపంలో ప్రధానార్చకులు ఇప్పిలి శంక రశర్మ ఆధ్వర్యంలో సుమంగళి అర్చన, నీలమణిధారణ నిర్వహించారు.
అరసవల్లి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా చైత్రశుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం ఆలయ అనివెట్టి మండపంలో ప్రధానార్చకులు ఇప్పిలి శంక రశర్మ ఆధ్వర్యంలో సుమంగళి అర్చన, నీలమణిధారణ నిర్వహించారు. అనంతరం ఆదిత్య ఆలయ ఇంద్రపుష్కరిణి వద్ద నాకబలి ప్రయుక్త చక్రతీర్థ స్నానం నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఆలయ ప్రవేశం గావించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రసాద్, అర్చకులు నేతేటి హరిబాబు, ఇప్పిలి ఫణీంద్రశర్మ, రంజిత్‌శర్మ, దర్భముళ్ల శ్రీనివాసశర్మ పాల్గొన్నారు.