Share News

దీర్ఘకాలిక సెలవుపై ఆదిత్యాలయ ఈవో

ABN , Publish Date - Sep 22 , 2026 | 12:05 AM

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ ఆకస్మికంగా సోమవారం నుంచి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు.

దీర్ఘకాలిక సెలవుపై ఆదిత్యాలయ ఈవో

ఒత్తిళ్లే కారణమా?

అరసవల్లి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ ఆకస్మికంగా సోమవారం నుంచి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆలయాభివృద్ధికి సంబంధించి, ఆలయ పరిసరాల్లోని స్థలాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించి, వారికి మెయిన్‌ రోడ్డులోని విలువైన ఆలయానికి చెందిన పెద్దతోట, చిన్నతోట వద్ద ఉన్న భూముల కేటాయింపు విషయమై ఽఅధికారిక ఒత్తి డులే సెలవుకు కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆలయానికి ప్రతి ఏటా ఆదాయం పెరిగి డీసీ స్థాయికి చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే ఆలయ అభివృద్ధికి సంబంధించి ల్యాండ్‌ టు ల్యాండ్‌ ప్రాతిపదికన భూ బదలాయింపునకు ప్రతిపాదించారు. ఆలయ పరిస రాల్లోని 1.22 ఎకరాల భూములను అభివృద్ధి కోసం తీసుకుని, అందుకు బదులుగా వారికి ఆలయానికి చెందిన 1.10 ఎకరాల భూమిని కేటా యింపునకు సంబంధించి ఆరోపణలు కూడా రావడంతో ఈ ఒత్తిడులు తట్టుకోలేక ఈవో వ్యక్తిగత, అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లిపో యినట్లు సమాచారం. కొత్తగా ‘స్వదేశీ దర్శన్‌’ పేరిట ఆలయ అభివృద్ధికి ప్రతిపాదనలు తెరమీదకు రావడం, నిర్మాణాలను ఆలయ భూముల్లోనే చేపట్టాలంటే ఎన్‌ఓసీ తప్పనిసరి కావడంతో, ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఈవో సెలవుపై వెళ్లిపోయారంటున్నారు. సోమవారం నుంచి నెల రోజుల పాటు ఈవో సెలవుపై వెళ్లిన నేపథ్యంలో ఆయన స్థానంలో విశాఖ పట్నం నుంచి డీసీ స్థాయి అధికారికి ఇన్‌చార్జిగా ఆలయ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - Sep 22 , 2026 | 12:06 AM