విద్యుత్ పంపిణీలో సేవా లోపాలను పరిష్కరించండి
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:02 AM
విని యోగదారులకు విద్యు త్ పంపిణీలో ఎదురయ్యే సేవా లోపాలను సత్వరం పరిష్కరించాలని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సీజీ ఆర్‌ఎఫ్) చైర్మన్ బి.సత్యనా రాయణ సిబ్బందికి సూచిం చారు.
కోటబొమ్మాళి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): విని యోగదారులకు విద్యు త్ పంపిణీలో ఎదురయ్యే సేవా లోపాలను సత్వరం పరిష్కరించాలని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (సీజీ ఆర్‌ఎఫ్) చైర్మన్ బి.సత్యనా రాయణ సిబ్బందికి సూచిం చారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల, మండల పరిషత్ ఆవరణలో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి అవలంబించిన సందర్భాల్లో వినియో గదారులు తమ సమస్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చునన్నారు. వినియో గదారులు సమస్యలపై తమ ప్రాంత పరిధిలోని విద్యుత్ కార్యాలయంలోని అసిస్టెంట్ ఇంజనీరు స్థాయి సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుందన్నారు. అలాగే 1912 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదులు సమర్పించుకోవచ్చునన్నారు. 2026లో తమ దృష్టికి 787 ఫిర్యాదులు రాగా... వీటిలో 687 పరిష్కరించామని చెప్పారు. వివిధ కారణాలతో 103 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో సభ్యులు (ఆర్థిక ) ఎస్.సుబ్బారావు, స్వతంత్ర సభ్యులు ఎన్.మురళీకృష్ణ, తహసీల్దార్ ప్రసాద్‌రావు, ఏఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.