Share News

విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించే చర్యలు

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:39 PM

చదువుకు నైపుణ్యం తోడైతే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధి స్తారన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఆలోచన కార్యరూపం దాల్చింది.

విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించే చర్యలు

శ్రీకాకుళం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): చదువుకు నైపుణ్యం తోడైతే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధి స్తారన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఆలోచన కార్యరూపం దాల్చింది. ఆయన ప్రత్యేక చొరవతో జిల్లాలోని రెండు ప్రభుత్వ పాఠశా లల్లో నూతనంగా ‘స్కిల్‌ ల్యాబ్‌’లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంఽధించి మంగళవారం శ్రీకాకుళం కలెక్టరేట్‌ నుంచి పరిపాలనా అనుమతులు లభించాయి. పిమర్సన్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ సంస్థ సీఎస్సార్‌ నిధులు రూ.30 లక్షలను ఈ ప్రాజెక్టు కోసం కేటాయిం చింది. ఈ నిధులతో శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూ ల్‌, నిమ్మాడ జడ్పీ హైస్కూళ్లలో స్కిల్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని సర్వశిక్షా అభియాన్‌ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో పాఠశాలలో రూ.15 లక్షల వ్యయంతో వీటిని నిర్మించనున్నారు. ఈ ల్యాబ్‌ లతో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించే బాధ్యతను ల్యాబ్‌ నిర్వ హణను ‘కాగ్నో స్పేస్‌’ అనే సంస్థ పర్యవేక్షించనుంది. నగరంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అదనపు భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన చేపట్టారు. తాజాగా స్కిల్‌ ల్యాబ్‌ మం జూరు కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ఈ రెండు పాఠ శాలల్లో స్కిల్‌ ల్యాబ్‌లు సేవలు అందించనున్నాయని, భవిష్యత్‌లో జిల్లా లోని మరిన్ని పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

Updated Date - Mar 31 , 2026 | 11:39 PM