కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి
ABN , Publish Date - May 14 , 2026 | 11:42 PM
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముఖ అని, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసినప్పుడే పార్టీ మరింత బలోపేతం అవు తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు.
గార, మే 14 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముఖ అని, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేసినప్పుడే పార్టీ మరింత బలోపేతం అవు తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. గురువారం గారలో నిర్వ హించిన మండల స్థాయి తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలుల్లో కార్యకర్తలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా నష్టపోయకుండా చూడాలన్నారు.గ్రామాల్లో తమ దృష్టికి వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు సంబంఽ దిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి చెందుతోందని, ఈనెలలో జరగనున్న మహానాడుకు మండలం నుంచి అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.