సమస్యల పరిష్కారానికి చర్యలు
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:29 PM
నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిం చడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.
- ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిం చడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమం నిర్వహించా రు. వివిధ సమస్యలపై 31 ఫిర్యాదులు వచ్చాయి. భూ వివాదాలు, గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలపై ఫిర్యాదు లు అందాయి. తక్షణం వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. జిల్లా నీటి సంఘాల డిస్టిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు గొనప నిరంజన్‌కు ఎమ్మెలే ్య శిరీష సత్కరించారు. వంశధార కాలువ ఆయకట్టు రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించే బాధ్యతను నీటిసం ఘాల నాయకులు తీసుకోవాలని సూచించారు. గ్రూప్-1లో విజయం సాధిం చి డీఎస్పీగా ఎంపికైన శివనాగగౌరి.. ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. శివనాగగౌరిని ఆమె సన్మానించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జి, నాయకులు లొడగల కామేశ్వరరావుయాదవ్, మల్లా శ్రీనివాస్, బడ్డ నాగరాజు పాల్గొన్నారు.