Share News

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:23 PM

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)కు సంబంధించి సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు
డీఆర్‌వలసలో సర్‌ ప్రక్రియపై ఆరా తీస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

- ‘సర్‌’ సిబ్బంది, బీఎల్వోల పనితీరుపై ఆగ్రహం

జి.సిగడాం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)కు సంబంధించి సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. శనివారం జి.సిగడాం, డీఆర్‌వలస గ్రామాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. సర్‌ సిబ్బంది, బీఎల్వోల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సమగ్ర ఓటర్ల జాబితా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆయన మండిప డ్డారు. ఇలా అయితే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చ రించారు. చాలా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల జాబితాలో మ్యాపింగ్‌ లేని ఓటర్లకు, చిరునామా, పేర్లు సవరణకు అందుబాటులో లేని ఓటర్లకు నోటీసు లు అందించడంలో వెనుకబాటుపై అసహనం వ్యక్తం చేశారు. త్వరితగతిన ఓటర్లకు నోటీసులు అందించి వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి గడువు లోగా సర్‌ ప్రక్రియను పూర్తి చేయా లన్నారు. ఆయన వెంట ఎచ్చెర్ల ఎన్ని కల రిటర్నింగ్‌ అధికారి రాజేశ్వరి, మం డల రిటర్నింగ్‌ అధికారి, తహసీల్దార్‌ మహాఽధేవు సరిత, డీటీ నిర్మల, పంచాయతీ కార్యదర్శి తులసీ ప్రసాద్‌ సాహూ, బీఎల్‌వోలు ఉన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:23 PM