Share News

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:05 AM

ఉపాధి పనుల్లో నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్ప వని డ్వామా పీడీ బి.లవ రాజు హెచ్చరించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ప్రజావేదికలో పాల్గొన్న పీడీ లవరాజు

  • డ్వామా పీడీ లవరాజు

నందిగాం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఉపాధి పనుల్లో నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్ప వని డ్వామా పీడీ బి.లవ రాజు హెచ్చరించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.28,70,52,326 మేర ఖర్చు చేసిన పనులపై శుక్రవారం ప్రజావేదిక నిర్వహించారు. 37 పంచాయతీల్లో క్షేత్రస్థాయిలో పనులను పరిశీ లించి సేకరించిన నివేదికలు డీఆర్‌పీలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. జిల్లాలో 44లక్షల పనిదినాలు లక్ష్యంగా నిర్దేశించామని, ప్రతి రోజూ 1.70 లక్షల పనిదినాలు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశామ న్నారు. నందిగాం మండలంలో 7,250 పనిదినాలు లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ఈ ప్రజావేదికలో ఎస్‌ఆర్‌పీ డి.రాజేంద్ర, పలాస, టెక్కలి ఏపీడీలు సీహెచ్‌ శ్రీనివాసరెడ్డి, శైలజ, విజిలెన్స్‌ అధికారి రాజకుమార్‌, ఈసీ అమ్మినా యుడు, డీడీవో అలివేలు మంగమ్మ, దిమిలాడ పీఏసీఎస్‌ చైర్మన్‌ పినకాన అజయ్‌కుమార్‌, ఎంపీడీవో యు.కుమార్‌ పట్నాయక్‌, ఉపాధి ఏపీవో ఎం.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:05 AM