Share News

యూరియా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:10 AM

యూరియాతో పాటు ఇతర ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని కొత్తూరు ఏడీఏ బి.రాజగోపాల్‌ హెచ్చరించారు. బుధవారం హిరమండలంలోని ఎరువుల దుకాణాలు తనఖీ చేశారు. ఆయనతోపాటు ఏవో సంధ్య ఉన్నారు.

 యూరియా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
హిరమండలం: ఎరువుల దుకాణంలో రికార్డులను తనిఖీ చేస్తున్న ఏడీఏ రాజగోపాల్‌:

హిరమండలం, జనవరి7 (ఆంధ్రజ్యోతి): యూరియాతో పాటు ఇతర ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని కొత్తూరు ఏడీఏ బి.రాజగోపాల్‌ హెచ్చరించారు. బుధవారం హిరమండలంలోని ఎరువుల దుకాణాలు తనఖీ చేశారు. ఆయనతోపాటు ఏవో సంధ్య ఉన్నారు.

ఫనరసన్నపేట,జనవరి7 (ఆం ధ్రజ్యోతి): యూరియా కృత్రిమకొరత సృష్టించవద్దని ఏవో సూర్యకుమారి కోరారు. బుధవారం ఉర్లాంలో ఎరువుల షాపులనుపరిశీలిం చారు.ఈసందర్భంగా మాట్లాడు తూ స్టాక్‌,ధరల బోర్డులు షాపు ముందుభాగంలో ప్రదర్శించాలని కోరారు.

ఫ సంతబొమ్మాళి,జనవరి7(ఆంధ్రజ్యోతి):నిబంధనలు అతిక్రమిస్తే ఎరువుల దుకాణం లైసెన్స్‌ రద్దు చేస్తామని ఏవో రాళ్లపాటి అప్పారావు తెలిపారు. బోరుభద్రలో ఎరువుల దుకాణాలను ఏవో తనిఖీ చేశారు.

ఫ పాతపట్నం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): పాతపట్నంలోని మనగ్రోమోర్‌ కేంద్రంలో ఏవో సింహాచలం తనిఖీ నిర్వహించి, రికార్డులను పరిశీలించారు. కొనుగోలు చేసిన రైతులకు రసీదును విధిగా అందజేయాలని కోరారు.

Updated Date - Jan 08 , 2026 | 12:10 AM