Share News

రేషన్‌ సరుకుల్లో తరుగు వస్తే చర్యలు

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:16 PM

రేషన్‌ డిపోలకు సరఫ రా చేసే సరు కుల్లో తరుగుదల వస్తే సహించేది లేదని ట్రైనీ కలె క్టర్‌ డి.పృథ్వీరాజ్‌ కుమార్‌ హెచ్చరించారు.

రేషన్‌ సరుకుల్లో తరుగు వస్తే చర్యలు
గోదాంను పరిశీలిస్తున్న ట్రైనీ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌

-ట్రైనీ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌

జి.సిగడాం, ఫిబ్రవరి 3 (ఆం ధ్రజ్యోతి): రేషన్‌ డిపోలకు సరఫ రా చేసే సరు కుల్లో తరుగుదల వస్తే సహించేది లేదని ట్రైనీ కలె క్టర్‌ డి.పృథ్వీరాజ్‌ కుమార్‌ హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఎఫ్‌సీ గోదాంను ఆయన తనిఖీ చేశారు. రేషన్‌ డిపోలకు సక్రమంగా సరుకులు అం దించాలని, అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చ రించారు. అనంతరం డీఆర్‌వలస గ్రామ సచివాలయాన్ని సందర్శిం చారు. సమయపాలన పాటించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌, సీఎస్‌ డీటీ తిరుపతి, ఎం.సరిత, ఆర్‌టీడీ కె.గాయత్రి, ఆర్‌ఐ ఎ.రాధ, మండల సర్వేయర్‌ ఎం.శాంతారాం, వీఆర్వో తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:16 PM