Share News

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:36 PM

:ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ హెచ్చరిక హెచ్చరించారు. శ్రీకాకుళంలో పారిశుధ్య పనుల్లో అలసత్వం వహించడానికి తావు లేదని స్పష్టంచేశారు.

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
పారిశుధ్య పనులను పరిశీలిస్తున్న జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ :

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మార్చి 5(ఆంధ్రజ్యోతి):ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ హెచ్చరిక హెచ్చరించారు. శ్రీకాకుళంలో పారిశుధ్య పనుల్లో అలసత్వం వహించడానికి తావు లేదని స్పష్టంచేశారు. గురువారం శ్రీకాకుళంలోని మండలవీధి, గుజ రాతీపేట సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో మురుగు కాలువల పూడికతీత పనులను పరిశీలించి, నీటి ప్రవాహానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా నిరంతరం క్లియర్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ నిర్దేశిత సమయానికి విధులకు హాజరుకావాలని, డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో బ్లీచింగ్‌ చల్లడం, క్లోరినేషన్‌ ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కోరారు.

Updated Date - Mar 05 , 2026 | 11:36 PM