ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:22 AM
ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠి న చర్యలు తప్పవని, అవసమైతే క్రి మినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ సనపల కిరణ్‌కుమార్ హెచ్చరించారు.
వేల్పురాయి పెద్ద చెరువును పరిశీలించిన రెవెన్యూ అధికారులు
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
రణస్థలం, జూలై 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములను అక్రమిస్తే కఠి న చర్యలు తప్పవని, అవసమైతే క్రి మినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ సనపల కిరణ్‌కుమార్ హెచ్చరించారు. వేల్పురాయి పెద్ద చెరువు ఆక్రమణలపై ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం పై రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ ఎం.సతీష్ సర్వేయర్ లింగరాజు పెద్ద చెరువుతోపాటు గడ్డ వా గుకు సంబంధించిన సరిహద్దులను గుర్తించి కంచె వేశారు. రైతులతో మాట్లాడారు. చెరువుని కబ్జా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.