ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:34 PM
ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుం టామని రణస్థలం ఏడీఏ వి.శ్రీనివాసరావు హెచ్చరించారు.
లావేరు, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుం టామని రణస్థలం ఏడీఏ వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. గురువారం బుడుమూరులోని బాలాజీ ఎంటర్ ప్రైజెస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు, నిర్ణయించిన ధరలకు విక్రయించాలని, లేకుంటే దుకాణం లైసెన్స్ రద్దుతో పాటు యజ మానిపై చర్యలుంటాయన్నారు. రబీలో రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు అన్ని దుకాణాల్లో సిద్ధంగా ఉన్నా యన్నారు. కార్యక్రమంలో ఏవో డి.మహేష్ నాయు డు తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల దుకాణం తనిఖీ
పాత శ్రీకాకుళం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక పాతబస్టాండ్‌లోని సకలాభక్తుల విశ్వనాథం అండ్ మల్లికార్జునరావు ఎరువుల దుకాణాన్ని వ్యవ సాయాధికారి పి.నవీన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, అమ్మకం బిల్లులు, రైతుల వివరాలు, ఆధార్ నమోదు, భూ విస్తీర్ణం మేరకు ఎరువుల పంపిణీ జరుగుతోందా లేదా తదితర అం శాలను పరిశీలించారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.