అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:18 AM
గారలో ఐఎస్‌వీఆర్ ఎరువుల దుకాణాన్ని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ త్రినాథస్వామి బుధవారం తనిఖీ చేశారు. షా
గార, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): గారలో ఐఎస్‌వీఆర్ ఎరువుల దుకాణాన్ని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ త్రినాథస్వామి బుధవారం తనిఖీ చేశారు. షాపులో స్టాక్ వివరాలు, ధరల పట్టికను పరిశీలించారు అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ధరల పట్టికలను, స్టాక్ వివరాలను ప్రదర్శిం చాలన్నారు. అనంతరం శాలిహుండాం రబీలో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏడీ బి.రజని, ఏవో డి.పద్మావతి, ఏఈవో బి.దుర్గా ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎరువుల దుకాణం ఆకస్మిక తనిఖీ
శ్రీకాకుళం రూరల్, జనవరి7 (ఆంధ్రజ్యోతి): ఒప్పంగి గ్రామంలోని లాడి గోవిందరావు ఫెర్టిలైజర్స్ దుకాణాన్ని మండల వ్యవసాయాధికారి పి.నవీన్ అకస్మిక తనిఖీ నిర్వహించారు. నిల్వ రిజిస్టర్లు, అమ్మకం బిల్లులు, రైతుల వివరాలు, ఆధార్ నమోదు, భూవిస్తీర్ణానికి అవసరమైన ఎరువుల పంపిణీ జరుగుతుందా అనే అంశాలను పరిశీలించారు. యూరియా రైతు లందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, నిబంధనలు కచ్చితం గా పాటించాలని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.