Share News

ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లితే చర్యలు

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:59 PM

: ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లితే బీఎల్‌వోలపై చర్యలు తప్పవని కలెక్టర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ తెలిపారు.

ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లితే చర్యలు
కోటబొమ్మాళి: సర్‌ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న కృష్ణమూర్తి :

పోలాకి, జూలై 5(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లితే బీఎల్‌వోలపై చర్యలు తప్పవని కలెక్టర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన ఉరజాంలోని ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 14లోగా కార్యాలయానికి నూతన ఓటర్ల నమోదు చేర్పులు, మార్పుల జాబితా పంపాల్సి ఉంటుందన్నారు. ఆయన వెంట తహసీల్దార్‌ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో రవికుమార్‌ ఉన్నారు.

’సర్‌’కు ప్రజలు సహకరించాలి: ఆర్డీవో

కోటబొమ్మాళి, జూలై 5(ఆంధ్రజ్యోతి):ప్రత్యేక సమగ్రసవరణకు (సర్‌) ప్రజలు అధి కారులకు సహకరించాలని టెక్కలి ఆర్డీవో ఎన్‌.కృష్ణమూర్తి కోరారు. ఆదివారం కొత్తపేట, కోటబొమ్మాళిల్లో సర్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా పలు పంచాయతీ ల్లో ఒకవార్డులో ఉండాల్సిన ఓటు మరోవార్డులో ఉండడంతో జాప్యం జరుగుతోందని ఆర్డీవోకు తహసీల్దార్‌ ప్రసాద్‌రావు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్య క్షుడు బోయిన సత్యశ్రీనివాస్‌, ఆర్‌ఐ పవిత్ర, వీఆర్వోలు రంగస్వామి పాల్గొన్నారు.

‘సర్‌’ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి: తహసీల్దార్‌

నరసన్నపేట, జూలై 5(ఆంధ్రజ్యోతి): సర్‌ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని నరసన్నపేట తహసీల్దార్‌ ఆర్‌.సత్యనారాయణ కోరారు. ఆదివారం జమ్ము, తామరాపల్లి, నరసన్నపేటలో పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు.

దామోదరసాగర్‌ అభివృద్ధి పనుల పరిశీలన

హరిపురం, జూలై5(ఆంధ్రజ్యోతి): దామోదరసాగర్‌ అభివృద్ధి పనులను కాళింగ కార్పొరేషన్‌ డైరక్టర్‌ బావన దుర్యోధన ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఆదివారం పరిశీలించారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌ ముంజేటి, రట్టి లింగరాజు, కర్రయ్య బమ్మిడి, గెదెల దుర్యోధన, రవీంద్ర, చంద్రమౌళి, భీమారావు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 11:59 PM