మస్తర్లలో తేడాలు కనిపిస్తే చర్యలు
ABN , Publish Date - Apr 16 , 2026 | 12:56 AM
గ్రామాల్లో ప్రతి కుటుంబా నికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని, అయితే మస్తర్లలో తేడాలు కనిపిస్తే చర్యలు తప్పవని డ్వామా పీడీ బి.లవరాజు అన్నారు.
డ్వామా పీడీ లవరాజు
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రతి కుటుంబా నికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని, అయితే మస్తర్లలో తేడాలు కనిపిస్తే చర్యలు తప్పవని డ్వామా పీడీ బి.లవరాజు అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉపాధి హామీ సామాజిక ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పార్పీ ఎస్.మాధవ్ పనుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా లవరాజు మాట్లాడుతూ.. ముగ్గురు డీఆర్పీలు 10 మంది విలేజ్ సోషల్ ఆడిటర్లు గ్రామసభలు నిర్వహించి పనులను తనిఖీ చేసి ఆడిట్ నిర్వహించారన్నారు. ప్రతీ వేతనదారుడికి కనీస వేతనం రూ.300 దాటేలా పనులు కల్పించాలని, పని జరిగినపుడు తప్పనిసరిగా టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండాలన్నారు. ప్రతీ వేతనదారుడికి ముఖ ఆధారిత యాప్‌లో మస్తర్ వేయాలని సూచించారు. మస్తర్‌లో గాని, పనుల్లో గాని అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీడీలు సీహెచ్ శ్రీనివాసరావు, పి.రాధ, హెచ్‌ఆర్ శ్రావణ్, ఎంపీడీవో ప్రభాకరరావు, ఎంపీపీ బోర పుష్ప, పీఏసీఎస్ చైర్మన్ పెదిని బాబ్జీ, ఏపీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
‘వేతనదారులకు పని కల్పించాలి’
కవిటి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామస్థాయిలో వేతనదా రులకు పని కల్పిం చేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ బి.లవరాజు అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. గ్రామస్థులకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలన్నారు. కరాపాడు, కొజ్జిరియా, సహలాలపుట్టుగ పంచా యతీల్లో పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చే యాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీడీలో రాధ, శ్రీనివాసరెడ్డి, మేనేజర్ శ్రావణి, ఏపీవో మోహనరావు పాల్గొన్నారు.