వినియోగదారుల హక్కులను కాలరాస్తే చర్యలు
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:44 PM
వినియోగదారుల హక్కులను కాలరాసేలా వ్యాపారులు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరిం చారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 14(ఆంధ్రజ్యోతి): వినియోగదారుల హక్కులను కాలరాసేలా వ్యాపారులు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరిం చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళ వారం జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారు లను తప్పుదోవ పట్టించేలా మోసపూరిత ప్రకట నలు, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువు లను విక్రయించే వ్యాపారులపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యం గా హోటళ్లు, మాల్స్, సినిమా థియేటర్లలో అధిక ధరలకు విక్రయాలు చేపడితే జరిమానాలు విధించాలన్నారు. గడువు దాటిన ఆహార పదార్థా ల విక్రయాలపై కేసులు నమోదు చేసి, ఉక్కు పాదం మోపాలని స్పష్టం చేశారు. ఆహార పదా ర్థాల కల్తీని నివారించేందుకు రెవెన్యూ, పోలీసు, ఆహార భద్రతా అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమా వేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, పౌర సరఫ రాల అధికారి సూర్యప్రకాశరావు, వినియోగ దారుల సమాఖ్య, జిల్లా అధ్యక్షుడు బగాది రా మ్మోహనరావు, బమ్మిడి నరేంద్ర కుమార్, గంజి ఎజ్రా, లఖినాన వెంకటాచలం, ఉప్పాడ రమేష్, అంధవరపు వెంకట సురేష్, తాలాబత్తుల ధనుం జయరావు, డి.ఉమామహేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఆర్టీఏ పీవీ గంగాధర్, వైద్యారోగ్య శాఖ ఎన్‌సీడీ కె.సూర్యప్రకాశరావు, లీగల్ మెట్రా లజీ అసిస్టెంట్ కంట్రోలర్ పి.చిన్నమ్మడు, ఆహార నియంత్రణాధికారి ఈఎల్ నారాయణ, డీపీటీవో సీహెచ్ అప్పలనారాయణ పాల్గొన్నారు.