Share News

నెమలికొండలో ఆక్రమణలకు పాల్పడితే చర్యలు

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:54 PM

నెమలికొండలో ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆర్‌ఐ మన్మఽథరావు, రెవెన్యూ సిబ్బంది

 నెమలికొండలో ఆక్రమణలకు పాల్పడితే చర్యలు
హుద్‌హుద్‌ గృహసముదాయం వద్ద నిర్మిస్తున్న ఇంటిని పరిశీలిస్తున్న అధికారులు:

పలాస, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): నెమలికొండలో ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆర్‌ఐ మన్మఽథరావు, రెవెన్యూ సిబ్బంది హెచ్చరిం చారు. సోమవారం జంటపట్టణాల్లోని నెమలికొండ దిగువున హుద్‌హుద్‌ గృహ సముదాయం ప్రాంతం లో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటిని రెవెన్యూ సిబ్బంది మధ్యాహ్నం పరిశీలించారు. ఆంధ్రజ్యోతిలో ఈనెల 21న కొండను తవ్వి..ఇంటినిర్మాణం శీర్షికతో కథనం ప్రచురితం కావడంతో ఆర్‌ఐతోపాటు వీఆర్వో ఖగేశ్వరరావు, సర్వేయర్‌ వై.గిరి ఆ స్థలానికి వెళ్లి పనులు నిలిపివేసి, సంబంధిత యజ మానులకు నోటీసులు జారీ చేశారు. కొండను తవ్వి నిర్మాణం చేపట్టడం తప్పని, మరోమారు ఇటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Mar 23 , 2026 | 11:54 PM